పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో గురువారం ఉదయం మొదటి విడత పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ సరళిని పరిశీలించిన కలెక్టర్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. సజావుగా పోలింగ్ జరిగేలా చూడడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.