కంభంలో రోడ్డు ప్రమాదం

కంభంలో రోడ్డు ప్రమాదం

ప్రకాశం: కంభం మండలంలో కందులాపురం గ్రామ సమీపంలోని HP పెట్రోల్ బంక్ దగ్గర గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ముగ్గురికి గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా క్షతగాత్రులను కంభం ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.