మంగళగిరిలో డెంగీ కేసు నమోదు
GNTR: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని చినకాకాని హాయ్ ల్యాండ్ రోడ్డులో ఓ యువకుడికి డెంగీ సోకింది. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న అతడికి ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దీంతో అధికారులు పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని, ఇంటింటికీ తిరిగి ఫీవర్ సర్వేలు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.