జిల్లాకు నేడు భారీ వర్ష సూచన

ATP: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు ఆనుకుని కేంద్రీకృతమైన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీని ఫలితంగా అనంతపురం జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, మరో రెండ్రోజులు ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రం వాతావరణ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నారాయణస్వామి తెలిపారు.