'బే షరతుగా విడుదల చేయాలి'

SRD: పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన తెలంగాణ శ్యామ్, పృధ్విరాజ్‌లను బే షరతుగా విడుదల చేయాలని దళిత సంఘాల నాయకుడు మొగులయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆందోల్‌లో ఒక ప్రకటన విడుదల చేస్తూ.. హైదరాబాదులో వారం రోజుల క్రితం మార్వాడీలు, గుజరాతీలు దళిత యువకుడిపై దాడులు చేశారన్నారు. ఆ విషయంలో మాట్లాడిన ఇరువురి వాక్యాలను వక్రీకరించి అరెస్టు చేశారన్నారు.