VIDEO: 'మహిళల భద్రత కోసం కఠిన చట్టాలు తీసుకురావాలి'
కృష్ణా: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుడివాడ సుందరయ్య భవనం వద్ద నుంచి నెహ్రూ చౌక్ వరకు మహిళలు ఆదివారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఐద్వా మండల కార్యదర్శి రజిని మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో గంజాయి, మత్తు పదార్థాలు మద్యం దుకాణాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం కఠినమైన రక్షణ చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.