కాంగ్రెస్ అభ్యర్థికి జేఏసీ మద్ధతు

కాంగ్రెస్ అభ్యర్థికి జేఏసీ మద్ధతు

HYD: జూబ్లీహీల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ మద్ధతు ప్రకటించినట్లు జేఏసీ ఛైర్మన్ సుల్తాన్ యాదగిరి తెలిపారు. ఈ మేరకు నాంపల్లిలో ఉద్యమకారుల జేఏసీ చీఫ్ అడ్వయిజర్, ఎమ్మెల్సీ కోదండరామ్‌ను ఉద్యమకారుల జేఏసీ ప్రతినిధులు కలిసి లేఖను అందజేశారు. ఇందులో కోతి మాధవి రెడ్డి, భోగి పద్మ, గుండమళ్ల శ్రీనివాస్, అనుముల రవీందర్ తదితరులు ఉన్నారు.