సమ్మర్ క్యాంపు సద్వినియోగం చేసుకుంటున్న క్రీడాకారులు

NRML: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును క్రీడాకారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇండోర్ ఔట్ డోర్ క్రీడలను క్రీడల అధికారులు నిర్వహిస్తుండగా పట్టణంలోని వివిధ వార్డులకు చెందిన 14 సంవత్సరాలలోపు క్రీడాకారులు హాజరవుతున్నారని ఆదివారం జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీధర్ తెలిపారు.