VIDEO: ప్లాస్టిక్ బ్యాగులపై కఠిన చర్యలు
NDL: బేతంచర్ల నగర పంచాయతీ పరిధిలో ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. శానిటరీ ఇన్స్‌స్పెక్టర్ మధుకుమార్ ఆధ్వర్యంలో ఇవాళ దుకాణాలు, హోటళ్లు, తోపుడు బండ్లపై దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ బ్యాగులను స్వాధీనం చేసుకుని యజమానులకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు.