బీఆర్ఎస్ పార్టీ వార్డు అభ్యర్థి సీపీఎంలో చేరిక

బీఆర్ఎస్ పార్టీ వార్డు అభ్యర్థి సీపీఎంలో చేరిక

NLG: ప్రజలకు కోసం పనిచేసే నాయకులకు ప్రజలు అండగా నిలువాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్ కోరారు. మండలంలోని తక్కెలపాడు గ్రామంలో బీఆర్ఎస్ వార్డు అభ్యర్ధి ఇద్దేబోయిన వెంకన్న శుక్రవారం సీపీఎం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన్‌ను పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీపీఎం పార్టీ చేస్తున్న ప్రజా ఉద్యమంలో ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు.