BREAKING: భారీగా తగ్గిన ధరలు

BREAKING: భారీగా తగ్గిన ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.2,940 తగ్గి రూ.1,45,970కి చేరింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల తులం ధర రూ.2,750 తగ్గి రూ.1,33,800గా నమోదైంది. మరోవైపు వెండి ధర ఏకంగా రూ.10,000 తగ్గి కిలో రూ.2,50,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా దాదాపు ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.