వంటగ్యాస్ కొరత.. పెరిగిన కట్టెల ధర

వంటగ్యాస్ కొరత.. పెరిగిన కట్టెల ధర

ATP: గుత్తి, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో వంటగ్యాస్ కొరత తీవ్రమైంది. గ్యాస్ బుక్ చేసి 15 రోజులైనా సరఫరా కాకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో కట్టెల ధరలు రెట్టింపు అయ్యాయి. నెల క్రితం 12 కిలోల కట్టెల ధర రూ.30-40 ఉండగా ఇప్పుడు రూ.60-70 వరకు పెంచారు. గ్యాస్ సరఫరాను పెంచాలని ప్రజలు కోరుతున్నారు.