చిరు వ్యాపారులతో ముచ్చటించిన ఎమ్మెల్యే
MBNR: జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్ యార్డులో ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మంగళవారం పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ చిరు వ్యాపారులతో ఆయన మాట కలిపారు. వ్యాపారం ఎలా సాగుతుందని గిట్టుబాటు అవుతుందా అంటూ పలకరించారు. అనంతరం వారి వద్ద పండ్లను కొనుగోలు చేశారు. చిరు వ్యాపారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసానిచ్చారు.