VIDEO: మధ్యాహ్న భోజనంలో పురుగులు
KMR: పురుగుల అన్నం మేం తినలేమంటూ విద్యార్థులు భోజనాన్ని పారేసిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం భగీరథపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. శుక్రవారం విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనంలో పురుగులు ఉండటంతో ప్లేట్లలోని అన్నాన్ని విద్యార్థులందరూ పారబోశారు. ఈ విషయాన్ని పాఠశాల హెచ్ఎంకు చెప్పినా పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపించారు.