అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు దగ్ధం

అగ్ని ప్రమాదంలో తాటాకు ఇల్లు దగ్ధం

ASR: కొయ్యూరు మండలం శింగవరం గ్రామంలో ఇవాళ జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి గ్రామానికి చెందిన పాము రాజు అనే వ్యక్తికి చెందిన ఇల్లు పూర్తిగా కాలిపోయిందని స్థానికులు తెలిపారు. ఇంట్లో ఉన్న దుస్తులు, బియ్యం, పాత్రలు, నగదు, సర్టిఫికెట్లు, సామాగ్రి మొత్తం కాలి బూడిద అయిందని తెలిపారు.