ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన స్పీకర్
AKP: నాతవరం మండలంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్పీకర్ అయ్యన్నపాత్రుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో రైతులు దళారులకు ధాన్యం అమ్ముకుని, డబ్బుల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఉండేదన్నారు, కానీ నేడు కూటమి ప్రభుత్వంలో ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు.