'సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం'

KRNL: నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు విమర్శించారు. గురువారం కర్నూలు సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. పరిశ్రమలు స్థాపించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17న విజయవాడలో నిరుద్యోగుల ఆవేదన సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.