కౌలు రైతు ఆత్మహత్య

GNTR: గడ్డి మందు తాగి కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ముప్పాళ్ల మండలంలోని చాగంటి పాలెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. చాగంటివారి పాలెం గ్రామానికి చెందిన కౌలు రైతు ఆళ్ళ ఆదినారాయణ(45) 5 ఎకరాలు పొలం కౌలుకు తీసుకుని మిర్చి, పసుపు పంటలను సాగుచేస్తున్నాడు. సుమారు 10 లక్షల రూ. అప్పుచేసి పెట్టుబడి పెట్టిన ఆశించిన పంట దిగుబడి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు.