దేవాదాయ శాఖ జోన్ కార్యాలయ భవనం ప్రారంభం
కర్నూలు నగరంలో రూ. 4.25 కోట్ల వ్యయంతో నిర్మించిన దేవాదాయ శాఖ కర్నూలు జోన్ పరిపాలనా కార్యాలయ భవనాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి టి.జి.భరత్, కలెక్టర్ డా.ఏ.సిరి, ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో సమావేశమయ్యారు.