బండలాగుడు పోటీలను ప్రారంభించిన ముత్తుముల

బండలాగుడు పోటీలను ప్రారంభించిన ముత్తుముల

ప్రకాశం: రాచర్ల మండలం అచ్చంపేటలో రామయోగి స్వామి వారి తిరుణాళ్ల సందర్భంగా గిద్దలూరు ఎమ్మెల్యే సోదరుడు ముత్తుముల కృష్ణ కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బండలాగుడు పోటీలను ప్రారంభించారు. ఎమ్మెల్యే సోదరునికి గ్రామస్థులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.