బాబు జగ్జీవన్ రామ్ డిగ్రీ కళాశాలలో వందేమాతరం గీతాలాపన

బాబు జగ్జీవన్ రామ్ డిగ్రీ కళాశాలలో వందేమాతరం గీతాలాపన

HYD: నారాయణగూడలోని బాబు జగ్జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇవాళ ప్రిన్సిపల్ కెప్టెన్ డా. ఎం. విజయ కుమార్ ఆధ్వర్యంలో సామూహిక వందేమాతర గేయాన్ని ఆలపించారు. NCC, NSS వాలీంటర్లచే కళాశాలలోని న్యూ కాన్ఫరెన్స్ హాలులో గేయాన్ని ఆలపించారు. కళాశాల ప్రొఫెసర్లు వందేమాతరం ప్రాధాన్యత, ప్రాముఖ్యత గురించి వివరించారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో ప్రాంగణమంతా మారుమ్రోగింది.