ఎక్సైజ్ అధికారుల పనితీరు భేష్: రవికుమార్

ఎక్సైజ్ అధికారుల పనితీరు భేష్: రవికుమార్

NDL: శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో నాటుసారా, మద్యం, గంజాయి వంటి నిషేధిత పదార్థాల నియంత్రణకు కృషి చేసిన 19 మంది పోలీస్ అధికారులను సోమవారం జిల్లా ఎక్సైజ్ అధికారి రవికుమార్ సన్మానించారు. నందికొట్కూరుకు చెందిన హెడ్ కానిస్టేబుళ్లు సుధీర్ కుమార్, మధు ప్రసాద్, కానిస్టేబుల్ రవి ప్రశంసా పత్రాలు అందుకున్నారు. సీఐ రామాంజనేయులు నాయక్ పాల్గొన్నారు.