ఒంగోలు ఇఫ్తార్ విందులో జిల్లా ఎస్పీ

ప్రకాశం: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రంజాన్ ఉపవాసాల సందర్భంగా.. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీసు కల్యాణ మండపంలో ఆదివారం ముస్లిం పోలీసు సిబ్బందికి ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ దామోదర్ హాజరై, ఇఫ్తార్ విందును స్వీకరించారు. మౌజన్ ఎస్.కె అబ్దుల్లా ప్రార్థన చేయించి, అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు.