VIDEO: 'రైతులకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలి'

ASF: ఇటీవల కురిసిన భారీ వర్షానికి పత్తి పంట దెబ్బతిన్న బాధిత రైతులకు ఎకరానికి రూ.50వేలు నష్టపరిహారం ఇవ్వాలని CPM నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వాంకిడి మండలం జైత్ పూర్ బోర్డ్ గ్రామంలో దెబ్బతిన్న పత్తి పంటలను వారు పరిశీలించారు. రైతుల సమస్యలను పరిష్కరిస్తూ ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.