ఆర్గనైజర్స్‌కు సీఐ సంగమేశ్వరరావు సూచనలు

ఆర్గనైజర్స్‌కు సీఐ సంగమేశ్వరరావు సూచనలు

TPT: ఓజిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వినాయక విగ్రహ ఆర్గనైజర్స్‌తో శనివారం సీఐ సంగమేశ్వరరావు సమావేశం ఏర్పాటు చేశారు. డీజే సౌండ్స్, మందు గుండు సామగ్రి పేల్చకూడదని సూచించారు‌. ఈ మేరకు వినాయక విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కమిటీ సభ్యులు జాగ్రత్త వహించాలని కోరారు.