భారత్‌లో టెస్లాకు గిరాకీ నిల్

భారత్‌లో టెస్లాకు గిరాకీ నిల్

ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉన్న టెస్లా కార్లకు భారత్‌లో డిమాండ్ అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవల మోడల్ Y కార్లను భారత్‌లో టెస్లా లాంచ్ చేసింది. అయితే గత OCTలో కేవలం 40 కార్లే అమ్ముడైనట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఈ కార్ల ధరలు అధికంగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కార్ల ధరల శ్రేణి రూ.59.89 లక్షల నుంచి రూ.67.89 లక్షలుగా ఉంది.