నాటుసారా స్థావరం పై దాడి...400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

E.G: గోపాలపురం మండలం వాదలకుంట గ్రామంలోని పంట కాలవ గట్టు వద్ద శనివారం నాటు సారా స్థావరంపై పోలీసులు దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో గుబ్బల శ్రీను అనే వ్యక్తిని అరెస్టు చేసి 3,000 రూపాయలు విలువైన 10 లీటర్లు నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు గోపాలపురం ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. 400 లీటర్లు బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లు తెలిపారు.