భారీ వర్షాలపై మంత్రి నారాయణ సమీక్ష

భారీ వర్షాలపై మంత్రి నారాయణ సమీక్ష

AP: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన, లోతట్టు ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపాలని ఆదేశించారు. విజయవాడలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో నివసించే వారిని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.