'మన కడప-స్వచ్ఛ కడప' కార్యక్రమంలో ఎమ్మెల్యే
కడప 34వ డివిజన్లో 'మన కడప-స్వచ్ఛ కడప' కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే మాధవి రెడ్డి శుక్రవారం చేపట్టారు. స్థానిక ఫంక్షన్ హాల్ వద్ద పారిశుద్ధ్యం, డ్రైనేజీ, వీధి లైట్లను పరిశీలించారు. స్థానికుల సమస్యలపై అధికారులను నిలదీసి, తక్షణ పరిష్కారానికి ఆమె ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్‌ఛార్జ్ షేక్ జావిద్, నగర అధ్యక్షుడు మన్సూర్ అలీ ఖాన్, పాల్గొన్నారు.