బైక్ ఢీకొని మత్స్యకారుడి మృతి

KMM: రోడ్డు ప్రమాదంలో మత్స్యకారుడు వెంకన్న (59) మృతి చెందారు. కూసుమంచి మండలం జీళ్లచెరువుకి చెందిన వెంకన్నను ఇవాళ ఉదయం సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్ళగూడెం వద్ద మరో బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించాడు. ఈ ఘటనపై మోతె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.