VIDEO: ఎంపీడీవో ఆఫీస్ ముందు ఉపాధి కూలీల ధర్నా
KMM: ఉపాధి హామీ పథకంలో రోజుకు రెండు పూటల ఫోటోలు తప్పనిసరి చేయడంపై తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిబంధనతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ నేలకొండపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం నిబంధనలు విధించడం సరికాదని, వెంటనే పాత విధానాన్ని పునరుద్ధరించాలని సంఘ నాయకులు డిమాండ్ చేశారు.