రిచా ఘోష్‌పై గంగూలీ ప్రశంసలు

రిచా ఘోష్‌పై గంగూలీ ప్రశంసలు

టీమిండియా మహిళల జట్టు వికెట్‌కీపర్ రిచా ఘోష్‌పై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. రిచా లోయర్ ఆర్డర్‌లో వేగంగా ఆడుతూ జట్టుకు విలువైన పరుగులు అందిస్తుందని కొనియాడాడు. అదేవిధంగా, రాబోయే రోజుల్లో మహిళా క్రికెట్ మరింతగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నాడు. భవిష్యత్తులో రిచాను భారత జట్టుకు కెప్టెన్‌గా చూడాలని అనుకుంటున్నట్లు తెలిపాడు.