పేరుకలపూడిలో గడ్డిమందు తాగి వ్యక్తి మృతి
GNTR: దుగ్గిరాల మండలం పేరుకలపూడికి చెందిన కుందేటి వెంకటేశ్వరరావు (44) ఈ నెల 9న మద్యం మత్తులో ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే అతడిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. హెచ్‌సీ చెన్నయ్య కేసు నమోదు చేశారు.