కమిషనర్ కార్యాలయంలో స్వాతంత్య్ర వేడుకలు

RR: 79వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎంతో మంది గొప్ప వ్యక్తులు చేసిన అపారమైన త్యాగాలను ఆయన కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో సైబరాబాద్ పోలీసులు ముందంజలో ఉన్నారన్నారు.