'ఏడాదికి రూ.24 కోట్ల నిధులు కేటాయిస్తాం'
NGKL: పీఎం ధన్ ధాన్య కృషి యోజన అమలుకు కృషి చేసి.. దేశంలోనే జిల్లాను ప్రథమస్థానంలో నిలపాలని నోడల్ అధికారి నీతూ కుమారి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. రైతుల ప్రయోజనాల దృష్ట్యా పథకం సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ పథకానికి ఏడాదికి రూ.24 కోట్ల నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.