VIDEO: ఘాట్ రోడ్డులో విరిగి పడిన కొండచరియలు

ASR: కొయ్యూరు మండలంలోని చింతాలమ్మ ఘాట్ రోడ్డులో బుధవారం కొండచరియలు విరిగిపడ్డాయి. గత వారం రోజులుగా మండలంలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఘాట్ రోడ్డులోని మలుపు వద్ద కొండచరియలు విరిగిపడ్డాయని స్థానికులు తెలిపారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఘాట్ రోడ్డులో పలుచోట్ల రాళ్లు,మట్టి జారిపడుతున్నాయని ఆందోళన చెందుతున్నారు.