శిర్గావ్ తొక్కిసలాట ఘటనపై విచారణకు ఆదేశం

గోవాలో జరిగిన ఘోర విషాదంపై సీఎం ప్రమోద్ సావంత్ విచారం వ్యక్తం చేశారు. ఆలయంలో తొక్కిసలాట జరిగి భక్తులు మరణించటం బాధాకరమని అన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. కాగా.. శిర్గావ్ లైరాయ్ దేవి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందగా, 60 మందికిపైగా గాయపడ్డారు.