VIDEO: పోలీసులపై రెచ్చిపోయిన యువకులు
GNTR: తెనాలిలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించిన ఘటన కలకలం రేపుతోంది. పట్టణంలోని బోసు రోడ్డులో బర్త్ డే వేడుకల పేరుతో నడిరోడ్డుపై మద్యం తాగుతూ హల్‌చల్ చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎస్సైతో వాగ్వాదానికి దిగి పోలీసులపైనే రెచ్చిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.