మంచాలలో పర్యటించిన కలెక్టర్ నారాయణరెడ్డి
RR: మంచాల మండల కేంద్రంలో కలెక్టర్ నారాయణరెడ్డి మంగళవారం పర్యటించారు. మూడో విడత కింద జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అధికారులకు తగిన సలహాలు, సూచనలను ఆయన అందజేశారు. మండలంలో పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. ఎన్నికల సమయంలో బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు.