సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్

సమస్యలు పరిష్కారానికి ప్రజా దర్బార్

AKP: సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ నిర్వహించినట్లు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ తెలిపారు. ఆదివారం గుండాల జంక్షన్ వద్ద 80, 81, 82, 83, 84వ వార్డుల పరిధిలో నిర్వహించిన ప్రజా దర్బారులో పలువురు సమస్యలపై అర్జీలను ఎమ్మెల్యేకు అందజేశారు. పలు సమస్యలను ఎమ్మెల్యే అక్కడికక్కడే పరిష్కరించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు.