అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

NDL: ప్రతి ఒక్కరూ అవయవదానంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్ హాలులో అవయవదానంపై అవగాహన కల్పించారు. అదే హాలులో జిల్లా రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో గత జూన్ మాసంలో మొట్టమొదట అవయవ దానం చేసిన మహిళ బొప్ప సుజాత కుటుంబ సభ్యులకు రూ. 50 వేల నగదు అందించారు. అవయవదానం ప్రాణదానమని కలెక్టర్ పేర్కొన్నారు.