క్రేన్ బావిలో పడడంతో ఇద్దరి దుర్మరణం

HNK: భీమదేవరపల్లి మండలం గట్టునరసింగాపూర్ గ్రామంలో ఏడు మేకల సంపత్ బావి వద్ద పూడికపనులు చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రేను బావిలో పడటంతో గండికోట ఎల్లయ్య, వేల్పుల వెంకటయ్య మృతి చెందారు. ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.