'సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి'

'సమన్వయంతో సమస్యలు పరిష్కరించండి'

సత్యసాయి: ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఆదేశించారు. ఇవాళ ఓడి చెరువు మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు సమర్థంగా ప్రజల్లోకి చేరాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.