సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

AKP: పాయకరావుపేట పట్టణ రాజు గారి బీడు ప్రాంతంలో సీసీ రోడ్డు నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వై వరహాల బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన పల్లె పండగ-2 కార్యక్రమం ద్వారా మండలంలో 47 సిమెంట్ రోడ్ల నిర్మాణానికి రూ.2.26 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఇప్పటివరకు 41 రోడ్ల నిర్మాణం పూర్తయిందని అన్నారు.