డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ADB: TGSRTC సమ్మె నేపథ్యంలో తాత్కాలిక ప్రతిపాదికన డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ ఉమ్మడి జిల్లా RM విజయ భాను పేర్కొన్నారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్, హెవీ లోడ్ వాహనాలను నడపడంలో నైపుణ్యం ఉన్నవారు అర్హులన్నారు. రోజువారీ వేతనం రూ. 1,000, అలాగే కండక్టర్ ఉద్యోగానికి పదో తరగతి పాసై ఉండాలన్నారు.