VIDEO: ఎంపీడీవో ఆఫీస్లను తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: ఎంపీడీవో ఆఫీస్లను తనిఖీ చేసిన కలెక్టర్

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో భూ భారతి దరఖాస్తులు, సాదా బైనమా కేసులు పరిశీలించి ప్రజా దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ పథకం అమలును సమీక్షించి, అధికారులకు పలు సూచనలు చేశారు.