'దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి'

'దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి'

SRPT: జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టపల్లి సైదులు పిలుపునిచ్చారు. ఆదివారం మోతే మండల కేంద్రంలోని భవన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికుల హక్కులను కాలరాస్తుందని విమర్శించారు.