3 నెలల బియ్యం పంపిణీకి సర్కార్ సిద్ధం!

3 నెలల బియ్యం పంపిణీకి సర్కార్ సిద్ధం!

TG: రేషన్ లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి పంపిణీ మొదలుకానున్నది. ఏప్రిల్, మే, జూన్ నెలల బియ్యాన్ని లబ్ధిదారులకు అందిస్తారు. ఇందుకోసం కావాల్సిన బియ్యంలో కొంత మేర ఇప్పటికే రేషన్ షాప్‌లకు చేరవేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ నిల్వలు తగ్గే కొద్ది దశల వారీగా సరఫరా చేస్తామని చెబుతున్నారు.