VIDEO: మల్లన్న సన్నిధిలో భక్తుల పూజలు

VIDEO: మల్లన్న సన్నిధిలో భక్తుల పూజలు

HNK: ఐనవోలు మండలంలోని శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి శుక్రవారం తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభం కావడంతో జిల్లాలోని అన్ని దేవాలయాల్లో భక్తుల తాకిడి పెరిగింది. మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన శ్రావణమాసం సందర్భంగా మహిళలు మహాలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. ఈ మాసం అంతా దాదాపు ప్రతిరోజు ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు చేస్తారు.