'రాక్షస పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు'

WG: ఐదేళ్ళ వైసీపీ రాక్షస పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని, వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో ఆ కష్టాల నుంచి గట్టెక్కి, హాయిగా జీవనం సాగిస్తున్నారని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. అందరికీ ఆమోదయోగ్యమైన పాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా శనివారం ఏలూరులో నిర్వహించారు.